ఆర్సీబీ: కుటుంబ సభ్యులతో కలిసి టీమ్ ఆనందోత్సాహాలు- 5 ఫోటోలలో..

ఫొటో సోర్స్, Reuters
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్‌ను గెలుచుకుంది.
ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో కొంతమంది క్రికెటర్ల భార్యా పిల్లలు స్టేడియంలో సందడి చేశారు.
మరికొందరు జట్టు సభ్యుల కుటుంబ సభ్యులు కూడా విజయోత్సవాలలో కనిపించారు.

ఫొటో సోర్స్, Reuters
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్టేడియంలోని జరుగుతున్న విజయోత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఫొటో సోర్స్, Reuters
రెండోసారి కప్పు గెలవడంతో ఆర్సీబీ జట్టు ఆనందోత్సాహాలలో మునిగిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
ఆర్సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అజేయంగా 75 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఫొటో సోర్స్, Reuters
ఒత్తిడికి గురై వెనుకబడిన జట్టు స్థాయి నుంచి చాంపియన్‌గా మారిన ఆర్సీబీ ప్రయాణం అత్యంత కష్టతరమైనప్పటికీ, వరుసగా రెండో టైటిల్ గెలిచి సత్తా నిరూపించుకుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























