You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
మురళీ నాయక్ వివాదం: సాధారణ సైనికులకు ఇచ్చే ప్రయోజనాలు అగ్నివీర్లకు ఉండవా? ప్రభుత్వ అఫిడవిట్లో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై మురళీ నాయక్ తల్లి, ఆమె న్యాయవాదులు ఇప్పుడు ఎలాంటి వాదనలు చేస్తారో చూడాలి. ఈ అఫిడవిట్‌ను చట్టపరంగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి కోర్టులో వాదనలు వినిపిస్తామని మురళీ నాయక్ కుటుంబం తరఫున న్యాయవాదులు తెలిపారు.
భారత్: ఎన్నికల్లో 'సంక్షేమ మంత్రం' ప్రభావం తగ్గుతోందా? మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏం చెప్పాయి?
"సంక్షేమం అనేది ఇప్పటికే భారత రాజకీయాల్లో ఉంది. దాన్నిదాటి పార్టీలు ఏం చేస్తాయన్నదే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంది. ఓటర్లు దీన్ని చాలాకాలం కిందటే అవగాహన చేసుకున్నారు. పోటీ ఆకాశాన్ని తాకుతుంటే విశ్లేషకులు ఇంకా నేల గురించే వాదిస్తున్నారు"
పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని ఎందుకు పెంచారు, నగల ధరలు పెరుగుతాయా?
గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం, మరోవైపు బంగారం ధరలు పెరుగుతుండటంతో.. పెట్టుబడి సాధనంగా బంగారంపై ఆసక్తి పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడులు 186% పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గత నెలలో వెల్లడించింది.
అనుమతి లేకుండా మైనింగ్ చేసిన కంపెనీ నుంచి ఆస్ట్రేలియా ఆదివాసీలకు రూ.800 కోట్ల పరిహారం
ఆదివాసీలకు తమ భూమితో ఎంతో లోతైన భావోద్వేగ సంబంధం ఉంటుందని, ఇది వారి జీవితాలను అన్నిరకాలుగా ప్రభావితం చేస్తుందని న్యాయమూర్తి స్టీఫెన్ బర్లీ వ్యాఖ్యానించారు. భూమితో ఉన్న సంప్రదాయ అనుబంధాన్ని కోల్పోయినందుకు, ఆ భూమి నుంచి ఆధ్యాత్మిక బలాన్ని పొందే హక్కులను కోల్పోయినందుకు వారికి ఈ పరిహారం అందాలని బర్లీ చెప్పారు.
‘లెక్కలేనన్ని వజ్రాలు వెలుగులు విరజిమ్ముతుండేవి'.. సోమనాథ్ ఆలయం గురించి చరిత్రకారులు ఏం రాశారు?
సోమనాథ్ అంశం కేవలం 1026లో జరిగిన దండయాత్రకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది 19, 20 శతాబ్దాల్లో రాజకీయంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో నిర్ణయించే ఒక సాధనంగా మారింది. సోమనాథ్ ఆలయ ద్వారాలు భారత రాజకీయాల్లో పదేపదే గుర్తుకు వచ్చే ఓ అంశంగా మారిపోయింది.
బండి భగీరథ్: ఇంకా దొరకని ఆచూకీ, బాధితురాలి వాంగ్మూలం తరువాత సెక్షన్లు మార్చిన పోలీసులు
బండి భగరీథ్‌కు పోక్సో చట్టం కింద పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే బాధితురాలి వాంగ్మూలం నమోదు తరువాత అంతకుముందు నమోదు చేసిన సెక్షన్లలో మార్పులు చేసినట్టు భగీరథ్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
వీడియో, నీట్ పరీక్ష రద్దు: ఇప్పుడు విద్యార్థులేం చేయాలి?, వ్యవధి 17,52
ఎంబీబీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షకు ఈసారి సుమారు 22 లక్షల మంది హాజరయ్యారు. ఈ పరీక్ష రద్దయిన నేపథ్యంలో వారంతా మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే, దీనికోసం ఎటువంటి అదనపు రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ.. ‘పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ ఎందుకన్నారు?
''ప్రశ్నపత్రంలోని 320 ప్రశ్నలలో 120 ప్రశ్నలు లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కేరళలో అయినా, సీకర్‌లో అయినా సరే, దోషులు ఎవరూ తప్పించుకోలేరు. ప్రభుత్వం ఈ విషయాన్ని అణచివేయాలని చూస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ వాస్తవానికి వెంటనే పరీక్ష రద్దు అయింది, సీబీఐ దర్యాప్తు ప్రారంభమైంది'' అని రాజస్థాన్ మంత్రి కిరోడీ లాల్ మీనా అన్నారు.
కోడి కాళ్లు తినొచ్చా? ఏమేం పోషకాలు ఉంటాయి
"చికెన్ కాళ్ల రుచి దాదాపు 'చికెన్ వింగ్స్' లాగే ఉంటుంది. ఇందులో మాంసం తక్కువగా ఉంటుంది, కానీ రుచిగా ఉంటుంది. చైనా, దక్షిణ ఆఫ్రికా, పోర్చుగల్ వంటి దేశాల్లో చాలా సాధారణంగా తింటారు. దీన్ని కేవలం 20 నిమిషాల్లోనే వండేయొచ్చు" అని ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆండ్రోస్ టౌన్సెండ్ బీబీసీతో అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.