BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘శిథిలాల కింద నుంచి నా కొడుకు ఏడుపు వినిపిస్తోంది’, ఓ తల్లి ఆవేదన
''నా కొడుకు బతికే ఉన్నాడనే నమ్మకం నాకుంది. ఆ ఏడుపు నా కొడుకుదే అని నా మనసు చెబుతోంది. నా కుటుంబం కచ్చితంగా ఈ ప్రమాదం నుంచి బయటపడుతుంది.''
India vs Australia: విమెన్స్ T20 వరల్డ్ కప్ నుంచి భారత్ అవుట్.. ఆసీస్ చేతిలో 6 వికెట్లతో ఓటమి
ఐసీసీ విమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్లతో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది.
‘‘మాకు సముద్రమే ఇల్లు’’- నెలల తరబడి నౌకల్లోనే ఉండే నావికుల జీవితాలు ఎలా ఉంటాయి?
"షిప్పులో ఎవరి క్యాబిన్ వాళ్లదే. ఈవెనింగ్ జిమ్, మెస్ రూంలో పార్టీలు చేసుకోవచ్చు. 15 రోజులకు, నెలకు ఒకసారి బార్బెక్యూ పార్టీలు కూడా ఉంటాయి. ఖాళీ సమయాల్లో సహోద్యోగులతో కబుర్లు, సినిమాలు చూడడం, వ్యాయామం చేయడం వంటి పనులతో సమయం గడుపుతారు. ప్రత్యేక సందర్భాల్లో పుట్టినరోజు వేడుకలు, పండుగల సంబరాలు కూడా చేసుకుంటారు’’
ఫిఫా వరల్డ్ కప్ 2026: రూ. 8,000 కోట్లకు పైగా ప్రైజ్ మనీ, విజేతకు ఎన్ని కోట్లంటే..
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026 జోరుగా సాగుతోంది. అమెరికా, మెక్సికో, కెనడాల్లో 48 దేశాల మధ్య జరిగే ఈ టోర్నీ కోసం ఫిఫా ఏకంగా 871 మిలియన్ డాలర్ల రికార్డు ప్రైజ్ మనీ కేటాయించింది. విజేతకే కాకుండా, పాల్గొనే ప్రతి జట్టుకూ కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. ఈ ప్రైజ్ మనీని ఏ జట్టుకు ఎలా పంచనున్నారంటే..
సంభోగం ముగిశాక ఆడ మిడత మగదాన్ని తినేస్తుందా? సైన్స్ ఏం చెబుతోంది?
ఆకులో ఆకులా కలిసిపోయే మిడతల వేట శైలి, 3డీ చూపు శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకీ, ఆడ కీటకం సంభోగం ముగిశాక నిజంగానే మగదాన్ని తినేస్తుందా? ఈ విలక్షణ ప్రత్యుత్పత్తి ప్రవర్తన వెనుక ఉన్న అసలు నిజాలేంటి..
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 అరంగేట్రంపై నిపుణుల భిన్నాభిప్రాయాలు, ఎవరేమన్నారంటే..
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 తుది జట్టులోనూ యువ బ్యాటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం వాయిదా పడినట్టైంది.
పగటి పూట అదేపనిగా ఆవులింతలు, కునికిపాట్లు ఎందుకు వస్తాయి? ఇది అనారోగ్యమా?
పగటి నిద్ర పనికి చేటు అంటారు.అయితే థైరాయిడ్, మధుమేహం లేదా ఊబకాయం వంటి జీవనశైలి సమస్యలు కూడా పగటి నిద్రను పెంచుతాయి. అందువల్ల, ఈ సమస్య కేవలం అలవాట్లుగా కొట్టిపారేయకుండా.. దీని వెనుకాలనున్న కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర లేకపోతే అప్రమత్తత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, త్వరగా స్పందించే సామర్థ్యం తగ్గిపోతాయి
కుక్కలను రక్షిస్తామన్న చోటే 100కుపైగా శునకాల కళేబరాలు, వాటిపై తుపాకీ గాయాలు, అసలేం జరిగింది?
కుక్కలను పాతిపెట్టారని భావిస్తున్న ప్రదేశంలోకి ఓ స్థానికుడు ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకోడానికి ఏప్రిల్‌లో అనుమతి లేకుండా ప్రవేశించి, అక్కడ తవ్వి చూశారు. ఆ తర్వాత ఈ విచారణ ప్రారంభమైందని స్థానిక మీడియా రాసింది.
ముడి చమురు ధరలు భారీగా తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
ఇంధన ధరలు తక్కువగా ఉండటం ద్రవ్యోల్బణ ఒత్తిడిని మరింత తగ్గిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌కు చమురు బిల్లులు తగ్గుతాయి. కరెంట్ ఖాతా లోటు కూడా తగ్గుతుంది. హార్ముజ్ జలసంధి తెరవడంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి. కానీ ఈ ముడి చమురు ధరల తగ్గింపు ప్రయోజనం భారతీయ వినియోగదారులకు వెంటనే అందదా?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































